T20 World Cup: భారత్‌తో ఆడం.. పాకిస్తాన్ ప్రభుత్వం షాకింగ్ ప్రకటన
భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup) పాల్గొనే విషయమై పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిచ్చినప్పటికీ, భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను మాత్రం బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో తమ జట్టు ఆడబోదని పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. అయితే ఈ మ్యాచ్ బహిష్కరణకు కచ్చితమైన కారణాన్ని వారు వెల్లడించలేదు.
భద్రతా కారణాల రీత్యా తమ టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) మ్యాచ్‌లను భారత్ నుంచి వేరే వేదికకు మార్చాలని బంగ్లాదేశ్ కోరగా.. ఐసీసీ అందుకు నిరాకరించి ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం కల్పించింది. దీనికి నిరసనగానే బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పాక్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి, ప్రసారకర్తలకు సమస్యాత్మకంగా మారింది. ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికరమైన, భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే (T20 World Cup) భారత్-పాక్ మ్యాచ్ రద్దు కావడం టోర్నీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. సల్మాన్ అలీ అఘా నేతృత్వంలోని పాక్ జట్టు గ్రూప్-ఏలో ఉంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.






