Washington: మరోసారి అమెరికా ప్రభుత్వం షట్ డౌన్..?
అమెరికా ప్రభుత్వం మరోసారి షట్‌డౌన్ అయింది . 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగిసింది. దాంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోనున్నాయి. గత అక్టోబర్ లో రికార్డ్ స్థాయిలో అమెరికాలో పాలన షట్ డౌన్ కాగా… రెండు నెలలు గ డవక ముందే మరోసారి అలాంటి పరిస్థితి నెలకొంది. ఓవైపు పాలన షట్ డౌన్ అవుతున్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో వరుస షట్ డౌన్ లు అమెరికాలో కామన్ గా మారుతున్నాయి.
మినియాపొలిస్‌లో ఇటీవల ఇద్దరు ఆందోళనకారులు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారుల కాల్పుల్లో మరణించడంపై సెనెట్ డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు ‘‘చట్టాన్ని అమలుచేసే అధికారులకు అమెరికా ప్రజలు మద్దతిస్తారు. సరిహద్దు భద్రతా దళాలకు మద్దతుగా నిలుస్తారు. కానీ వీధుల్లో భయభ్రాంతులకు గురిచేస్తూ.., అమెరికా (USA) పౌరులను చంపే ఐసీఈ అధికారులను ఉపేక్షించబోరు’’ అని తీవ్రంగా స్పందించారు. దానిని సంస్కరించకపోతే నిధుల విడుదల బిల్లుకు అవసరమైన ఓట్లు వేయబోమంటూ వారు హెచ్చరించారు. దీంతో హోంలాండ్ భద్రత, ఇతర విభాగాలకు నిధులు నిలిచిపోనున్నాయి. అయితే ఇది పాక్షికమేనని వచ్చేవారం ఈ నిధుల బిల్లుపై మరోసారి చర్చలు జరగనున్నాయని చట్టసభ సభ్యులు పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గతేడాది అక్టోబర్ 1న కూడా అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ అయింది. ఆ దేశ చరిత్రలో సుదీర్ఘకాలం (43 రోజులు)పాటు కొనసాగింది. అమెరికాలో షట్‌డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. 1981 నుంచి యూఎస్ ప్రభుత్వం 16 సార్లు మూతపడింది. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు మూతపడగా.. నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు.






