అమెజాన్ శుభవార్త… భారీ సంఖ్యలో
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 55 వేల మందిని నియమించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికాలో అత్యధికంగా 40 వేల మందిని రిక్రూట్ చేసుకుంటామని స్పష్టం చేసింది. రానున్న నెలల్లో కార్పొరేట్, టెక్నాలజీ విభాగాల్లో ఈ నియామకాలను చేపడతామని కంపెనీ సీఈవో అండీ జస్సీ తెలిపారు. అమెజాన్ సీఈవోగా బాథ్యతలు చేపట్టాక జస్సీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. రిటైల్, క్లౌడ్, అడ్వర్టైజింగ్తో పాటు ఇతర బిజినెస్ విభాగాల్లో డిమాండ్‌ను అమెజాన్ వద్దే కొనసాగించేందుకు మరింత సామర్థ్యం అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. టెక్ ఉద్యోగాల విషయానికి వస్తే వేర్ హౌస్ వర్క్ ప్యాకేజింగ్, షిప్పింగ్ ఆర్డర్స్‌లో పనిచేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. అమెజాన్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల మంది ఉద్యోగులు ఉన్నారు.






