ఇంటి నుంచే అంతర్జాతీయ స్థాయి కోర్సులు.. విదేశీ విశ్వవిద్యాలయాల సరికొత్త ఆఫర్!
Free Courses: చాలా మంది విద్యార్థులకు విదేశాలకు వెళ్లి చదువుకోవాలనేది ఒక కల. కానీ ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాల వల్ల అక్కడికి వెళ్లలేకపోయే వారు. ఇప్పుడు ఇంటి నుంచే విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఈ సంస్థల్లో వివిధ కోర్సుల్లో చేరి, తమకు నచ్చిన విభాగాల్లో ప్రాథమికాంశాలను ఉచితంగా నేర్చుకునే వీలుంది. దీనివల్ల విదేశీ యూనివర్సిటీల్లో చదివామన్న అనుభూతి కలగడమే కాకుండా, జాబ్ మార్కెట్లో అద్భుతమైన అవకాశాలు అందుకోవచ్చు. సంబంధిత విశ్వవిద్యాలయ అధ్యాపకులే ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ పాఠాలను బోధిస్తారు.
టాప్ యూనివర్సిటీలు అందించే కోర్సులు..
జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (MOOCs) ద్వారా ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, బిజినెస్, కంప్యూటింగ్, మ్యాథమెటిక్స్, సప్లై చెయిన్ వంటి 30 కోర్సులను అందిస్తోంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్, యూఎక్స్ డిజైన్, డేటా అనలిటిక్స్, పైతాన్, మెషిన్ డిజైన్, స్టాటిస్టిక్స్ వంటి అంశాలను ఉడాసిటీ, కోర్సెరా, ఎడ్ఎక్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
హార్వర్డ్ యూనివర్సిటీ: ఐవీ లీగ్‌లో అత్యంత పురాతనమైన ఈ సంస్థ సుమారు 600లకు పైగా ఉచిత కోర్సులను 1 నుండి 12 వారాల వ్యవధితో అందిస్తోంది. బిగ్ డేటా, సామాజిక అంశాలు, ప్రోగ్రామింగ్, గేమ్ డెవలప్మెంట్, న్యూరోసైన్స్ వంటి విభిన్న కోర్సులను ఇక్కడ నేర్చుకోవచ్చు.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ): ఇక్కడ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల్లో దాదాపు 3000 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏరోనాటిక్స్, ఫిజిక్స్,కెమిస్ట్రీ, ఎకనమిక్స్, ఆర్కిటెక్చర్ వంటి సబ్జెక్టులను నేరుగా డౌన్లోడ్ చేసుకుని చదివే వీలుంది. సైంటిఫిక్ థియరీలను నేర్చుకోవడానికి ఇది అత్యుత్తమ సంస్థగా పేరు పొందింది.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా: ఎడ్ఎక్స్ సంస్థతో కలిసి ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఇంగ్లీష్ లిటరేచర్, బిజినెస్ రైటింగ్, జర్నలిజం,సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, వంటి కోర్సులను అందిస్తోంది. ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కావాలనుకుంటే మాత్రం కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
మిషిగాన్ స్టేట్ యూనివర్సిటీ: గేమ్ డెవలప్మెంట్, స్క్రిప్ట్ రైటింగ్, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, పిక్సల్ ఆర్ట్ వంటి సృజనాత్మక కోర్సులను ఇక్కడ చేయవచ్చు. దాదాపు ఆరు నెలల వ్యవధిలో ఇవి పూర్తి చేసి కంప్లీషన్ సర్టిఫికెట్ పొందవచ్చు.
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆర్ట్స్: మ్యూజిక్ థియరీ, పొయిట్రీ, ఫ్రీలాన్సింగ్ బిజినెస్, గేమ్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, యూఐ/యూఎక్స్ డిజైన్ వంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్‌ను కోర్సెరా ద్వారా అందిస్తోంది. సర్టిఫికెట్స్ కావాలంటే ఫీజు చెల్లించాలి.
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్: క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న ఈ యూకే కాలేజీ సిటిజన్ సైన్స్, కల్చర్, ఆంత్రొపాలజీ, హెల్త్ వంటి 170కి పైగా ఉచిత ప్రోగ్రామ్స్‌ను ఆన్లైన్లో అందిస్తోంది.
