Mukesh Ambani: సూపర్ బిలియనీర్లలో అంబానీ అదానీలకు చోటు

ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన 24 మంది సూపర్ బిలియనీర్ల జాబితాను ది వాల్‌స్ట్రీట్ జర్నల్ (The Wall Street Journal) విడుదల చేసింది. సంపద నికర విలువ కనీసం 50 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.4.35 లక్షల కోట్లు) ఉన్న వారిని సూపర్ బిలియనీరుగా సంస్థ పరిగణించింది. ఈ 24 మందిలో 16 మంది సెంటి బిలియనీర్ల (100 బిలియన్ డాలర్లు /రూ.8.7 లక్షల కోట్ల) ని నివేదిక తెలిపింది. వీరందరి సంపద విలువ కలిపితే 3.3 లక్షల కోట్ల డాలర్లని, ఫ్రాన్స్ జీడీపీకి ఇది సమానమని పేర్కొంది. ఇందులో మనదేశం నుంచి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) (90.6 బి.డాలర్లు), గౌతమ్ అదానీ 9 Gautam Adani) ( 60.6 బి.డాలర్లు) కి చోటు దక్కింది.
419.4 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్(Elon Musk) ఈ జిబాతాలో అగ్రస్థానంలో నిలిచారు. జెఫ్‌బెజోస్ (263.8 బి.డా), బెర్నార్డ్ అర్నాల్ట్ (238.9 బి.డా.), లారీ ఎలిసన్ (237 బి.డా.), జుకర్‌బర్గ్ (220.8 బి.డా.) సెర్గీ బ్రిన్ (160.5 బి.డా.), స్టీవ్ బామర్ (157.4.బి.డా.), వారెన్ బఫెట్ (154.2.బి.డా.), జేమ్స్ వాల్టన్ (117.5 బి.డా), శామ్యూల్ రాబ్‌సన్ వాల్టన్ (114.4 బి.డా.) ఈ జాబితాలోని తొలి 10 మందిలో ఉన్నారు.