Shubhaman Gill: గిల్ కు ఛాన్స్ మిస్.. అభిషేక్ లేదంటే అయ్యర్..?
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో కెప్టెన్సీ పదవి కోసం యువ ఆటగాళ్లు ఆరాటపడుతూ ఉంటారు. ఆటగాళ్ల సమర్థతను ఆధారంగా చేసుకుని బోర్డు, సెలక్టర్లు కెప్టెన్సీ పదవికి ఎందుకు చేయడం సహజమే. అయితే కెప్టెన్ గా ఎంపిక అయినా ఆటగాడి ఆట తీరు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలి. కానీ శుభమన్ గిల్ మాత్రం ఆస్ట్రేలియా(Australia) లో వరుసగా విఫలం కావడం ఆశ్చర్య పరుస్తోంది. జూన్ నెలలో జరిగిన ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో గిల్ అద్భుతంగా రాణించాడు. అయితే అత్యుత్తమ బౌలర్లు కాదనే అభిప్రాయం కూడా ఉంది.
ఇక దుబాయిలో జరిగిన ఆసియా కప్ లో గిల్ రాణించలేదు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన వెస్టిండీస్ సిరీస్ లో మాత్రం ఓ అర్థ సెంచరీ, సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఇక తర్వాత వెంటనే ఆస్ట్రేలియా పర్యటనకు అతనిని వన్డే జట్టుకు కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఐపీఎల్ మినహా అంతర్జాతీయ టి20లో గిల్ పెద్దగా రాణించడం లేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ లో గిల్ వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అలాంటి ఆటగాడిని కెప్టెన్ చేయాలి అనే తొందర ఎందుకు అనే విమర్శలు వస్తున్నాయి.
ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం గిల్ ను టి20 కెప్టెన్సీ పదవికి పక్కన పెట్టినట్లుగానే కనబడుతోంది. సూర్య కుమార్ యాదవ్ తర్వాత గిల్ స్థానంలో అభిషేక్ శర్మ, లేదంటే శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) ను కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశం కనబడుతోంది. సూర్య కుమార్ యాదవ్ గత కొన్నాళ్లుగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. కాబట్టి అతనిని తప్పించాలని డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ గా ఉన్న గిల్.. కెప్టెన్ అయ్యే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరిగింది. ఇటు అభిమానుల నుంచి, మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు రావడంతో ఈ ఆలోచనను సెలక్టర్లు విరమించుకున్నట్లు సమాచారం. ఆసియా కప్ లో కూడా ఫెయిల్ కావడంతోనే గిల్ విషయంలో పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అటు మాజీ ఆటగాళ్లు కూడా కెప్టెన్సీ పదవి కోసం త్వరపడకుండా ఆట తీరుపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.







