వర్జీనియాలో ఆటా బృందం ప్రచారం
బాల్టిమోర్‌లో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న ఆటా మహాసభలను పురస్కరించుకుని ఆటా టీమ్ ఇప్పటికే వివిధ నగరాల్లో ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించింది. వర్జీనియాలో కూడా ఆటా నాయకులు మహాసభలకు రావాల్సిందిగా పలు ప్రదేశాల్లో ప్రచారాలను చేశారు. అలాగే కాన్ఫరెన్స్ కమిటీ నాయకులు వారాంతంలో సమావేశమై తమ ప్రచార కార్యక్రమాలపై, మహాసభల నిర్వహణ ప్రణాళికా కార్యకలాపాలపై చర్చలు జరిపారు. జిడబ్ల్యుటీసీఎస్ వారు నిర్వహించిన ఉగాది వేడుకల్లో కూడా ఆటా నాయకులు, కాన్ఫరెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆటా మహాసభలకు అందరూ రావాలని ఆహ్వానించారు. అనంతరం, బృందం శివ విష్ణు ఆలయాన్ని సందర్శించి, అక్కడి బోర్డు సభ్యులను కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వారి మద్దతును కోరింది. అలాగే, ‘స్టైల్ అండ్ షైన’ ఈవెంట్‌ను సందర్శించి, అక్కడ ఉన్న వ్యాపారులను కాన్ఫరెన్స్‌లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు.
వివిధ కమిటీలకు చెందిన సుమారు 100 మంది బృంద సభ్యులు సమావేశమై, పనుల పురోగతిని సమీక్షించి, తదుపరి చర్యలను గుర్తించి, అవసరమైన ఫీడ్‌బ్యాక్‌ను సేకరించారు. మదర్స్ డే వేడుకల్లో కూడా ఆటా నాయకులు పాల్గొన్నారు. ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా గారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహిళలు ప్రతిరోజూ చేసే నిస్వార్థ త్యాగాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, మన జీవితాల్లో మహిళలను గౌరవించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ఈ సమావేశంలో బ్యూటీ పీజెంట్, కల్చరల్, ఫుడ్, గోల్ఫ్ టోర్నమెంట్, హాస్పిటాలిటీ, ప్రారంభోత్సవ, మ్యాట్రిమోనీ, మీడియా, రాజకీయ, రిసెప్షన్/స్వాగత, ప్రాంతీయ సమన్వయ, ఆధ్యాత్మిక, స్టేజ్ కోఆర్డినేషన్, వెండర్, వాలంటీర్, వెబ్సైట్, మహిళా మరియు యువజన విభాగాల కమిటీలు పాల్గొన్నాయి. కన్వెన్షన్ నాయకత్వ బృందం కమిటీ సభ్యులందరికీ మరియు వాలంటీర్లకు వారి అద్భుతమైన మద్దతుకు ధన్యవాదాలు తెలియజేసింది.
ఇవి కూడా చదవండి
