UBS: ఉస్తాద్ భగత్‌సింగ్ నైజాం డే1 కలెక్షన్లు
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan Kalyan) నటించిన తాజా సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath singh) భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చి మంచి ఓపెనింగ్స్ నమోదు చేసింది. కల్ట్ కెప్టెన్ గా పేరొందిన డైరెక్టర్ హరీష్ శంకర్(Harish sankar) ఈ సినిమాను పక్కా మాస్ ఎంటర్టైనర్గా మలచగా, రిలీజైన మొదటి రోజే ఈ సినిమా కు ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. కథ, డైలాగ్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలం కాగా, మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇవి కూడా చదవండి
మిక్డ్స్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా తన దూకుడును కొనసాగిస్తోంది. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో మొదటి రోజే సుమారు రూ. 6.5 కోట్ల షేర్ వసూలు చేసి సత్తా చాటింది. అదే సమయంలో బాలీవుడ్ సినమా ధురందర్: ది రివెంజ్(Durandhar: the revenge) నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ తన మార్కెట్ స్ట్రెంగ్త్‌ను మరోసారి నిరూపించారు. ట్రేడ్ వర్గాల ప్రకారం వీకెండ్లో ఉస్తాద్ భగత్‌సింగ్ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించిన ఈ సినిమాలో హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల(Sree Leela), అందాల తార రాశీ ఖన్నా(Raashi Khanna) హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రపంచవ్యాప్త కలెక్షన్లను ప్రకటించనుండగా, ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి స్థిరత్వాన్ని చూపుతుందన్నదిపై ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
