UBS: ఉస్తాద్ భగత్‌సింగ్ ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొల్పిన కాంబినేషన్లలో పవన్ కళ్యాణ్(pawan kalyan), హరీష్ శంకర్(harish shankar) జోడీ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వీరిద్దరి కలయికలో రూపొందిన తాజా సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad bhagath singh) ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవర్ స్టార్ మాస్ ఎనర్జీకి హరీష్ శంకర్ స్టైల్ జత కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా భావిస్తున్నారు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై రోజురోజుకూ హైప్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా మరో సాలిడ్ అప్డేట్ ను ప్రకటించి అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
చిత్ర బృందం అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్(Ustaad bhagath singh trailer)ను మార్చి 14న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో గన్ పట్టుకుని పవర్ స్టార్ పూర్తి యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ స్టైల్, అగ్రెసివ్ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ట్రైలర్లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ ఎలిమెంట్స్, డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలను ఎలా చూపించబోతున్నాడో అన్న ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లోనూ పెరిగింది.
ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో శ్రీలీల(Sree leela), రాశీ ఖన్నా(Raashi khanna) హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో ట్రైలర్‌పై మరింత అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందే భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి