టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ అయిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఉదయపూర్ లోని ఓ రిసార్ట్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.
తెలుగు మరియు కొడవ సాంప్రదాయాల్లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.
మూడు రోజుల పాటూ జరిగిన ఈ పెళ్లి వేడుకల కోసం ఈ జంట ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేసిందట.
ఈ పెళ్లి కోసం విరోష్ జంట 3 కిలోల బంగారు నగలు ధరించారు.
అందులో రష్మిక 2 కిలోల ఆభరణాలు ధరిస్తే, విజయ్ దేవరకొండ 1 కిలో బంగారు ఆభరణాలు ధరించి స్పెషల్ గా నిలిచారు.