Irumudi: ఇరుముడిలో తమన్నా?
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ(ravi teja) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన కొత్త ప్రాజెక్ట్ ఇరుముడి(irumudi) ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు శివ నిర్వాణ(Shiva nirvana) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియాను సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే, గతంలో వచ్చిన బెంగాల్ టైగర్(Bengal tiger) తరువాత రవితేజ(ravi teja)- తమన్నా(tamannaah) జోడీ మరోసారి తెరపై కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అభిమానులు ఈ వార్త నిజమవుతుందా లేదా అన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
![]()
ఇక ఇరుముడి సినిమాలో హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్(priya bhavani shankar) నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోంది. ఈ మూవీ రవితేజ కెరీర్లో మరో స్పెషల్ ఫిల్మ్ గా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఇరుముడి రవితేజకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి