సుకుమార్ ఇంకా ఆ పనుల్లోనే బిజీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా తెరకెక్కిన పుష్ప2(Pushpa2) తర్వాత స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తన తర్వాతి ప్రాజెక్ట్‌పై పూర్తి ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్(ram charan) తో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్స్ ను వేగవంతం చేశారు. గత కొన్ని నెలలుగా మూడు విభిన్న కథలపై ఒకేసారి వర్క్ చేసిన సుకుమార్, చివరికి చరణ్‌తో జరిగిన విస్తృత చర్చల అనంతరం ఒక కథను ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ ను రెడీ చేసే పనిలో ఆయన తన టీమ్‌తో బిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
సుకుమార్ వర్కింగ్ స్టైల్ గురించి టాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం తీసుకునే ఆయన, షూటింగ్ సమయంలో కూడా చివరి నిమిషంలో మార్పులు చేయడంలో ప్రసిద్ధి పొందారు. ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ, కథను మరింత పర్ఫెక్ట్గా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. మే మధ్యలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైనల్ నెరేషన్ జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెరేషన్ తరువాత సినిమాకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
ఇక షూటింగ్ విషయానికి వస్తే, ఈ అన్టైటిల్డ్ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందు రామ్ చరణ్ కొంత విరామం తీసుకుని తన లుక్‌పై ప్రత్యేకంగా పనిచేయనున్నాడు. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మించనుండగా, త్వరలోనే షూటింగ్ షెడ్యూల్స్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
