Telugu cinema: తెలుగు సినిమా పొట్టలో అన్నీ పురుగులేనా…?

తెలుగు సినిమా పరిశ్రమంలో మనస్పర్ధలు ఉన్నాయి అనే విషయం అల్లు అర్జున్ వ్యవహారం తర్వాత పెద్ద ఎత్తున బయటకు వచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్ లో అగ్ర కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అనే క్లారిటీ అభిమానులకు కూడా వస్తోంది. అల్లు అర్జున్ (Allu Arjun) ను అరెస్టు చేసిన తర్వాత అలాగే ఒక చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తర్వాత సినిమా పరిశ్రమలో ప్రముఖ కుటుంబాలుగా చెప్పుకునే అక్కినేని, దగ్గుబాటి, నందమూరి, మెగా కుటుంబాలు ఆసుపత్రి వైపు చూడకపోవడం… అలాగే అల్లు అర్జున్ వ్యవహారం పై మాట్లాడకపోవడంతో అసలు ఏం జరుగుతుందో అనేది అభిమానులు కూడా స్పష్టత రావడం లేదు.
వీళ్ళందరూ కలిసే ఉన్నారు అనే అభిప్రాయంలో ఉన్న అభిమానులకు వీళ్ళ వ్యవహార శైలి కాస్త అనుమానాస్పదంగా మారింది. అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన తర్వాత నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ గానీ బాలకృష్ణ గానీ వెళ్లి పరామర్శిస్తారని చాలామంది ఎదురు చూశారు. కానీ అది ఏమీ జరగలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. అల్లు అర్జున్ తో ఫోన్లో మాట్లాడి తాను హైదరాబాదులో లేనని వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. నందమూరి బాలకృష్ణ మాత్రం హైదరాబాదులోనే ఉన్నా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లలేదు.
అలాగే దగ్గుబాటి కుటుంబం నుంచి వెంకటేష్ కూడా అల్లు అర్జున్ ను కలవడానికి ఇష్టపడలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి గాని నా నాగబాబు గానీ పవన్ కళ్యాణ్ గాని అల్లు అర్జున్ విషయంలో అంత సానుకూలంగా కనపడటం లేదు. మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటికి రావాలని అల్లు అర్జున్ ప్రయత్నాలు చేయడాన్ని మెగా ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతోంది. దీనితోనే అల్లు అర్జున్ కలవడానికి ఇష్టపడలేదు. ఇక ప్రభాస్ (Prabhas) కూడా హైదరాబాద్ లోనే ఉన్నా… బన్నీ ఇంటికి వెళ్ళలేదు.
కానీ అల్లు అర్జున్ మాత్రం చిరంజీవిని నాగబాబుని వారి ఇళ్లకు వెళ్లి కలిసి వచ్చారు. ఇక నాగార్జున కుటుంబం మాత్రం ఈ విషయంలో అసలు ఏమీ మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు. అటు మహేష్ బాబు గాని ప్రభాస్ గాని ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. ప్రభాస్ హైదరాబాదులోనే ఉన్నా… అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో సినిమా పరిశ్రమంలో చీలికలు ఉన్నాయి అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో బలపడుతోంది.