NetSuite Datacenter: హైదరాబాద్‌లో నెట్‌సూట్ డేటాసెంటర్

భారత ఆర్థిక రాజధాని ముంబై, హైదరాబాద్ (Hyderabad)లో డేటా సెంటర్ల (Datacenter) ను ఏర్పాటు చేయబోతున్నట్లు అమెరికాకు చెందిన నెట్‌సూట్ (NetSuite) ఇంక్ ప్రకటించింది. భారత్ (India)లో పెరుగుతున్న కస్టమర్లకు మద్దతివ్వడంతో పాటు కార్యకలాపాలను అంతర్జాతీయంగా విస్తరించే దిశగా సంస్థ అడుగులు వేస్తోంది. 1998లో ప్రారంభమైన ఈ కంపెనీని చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలకు (ఎస్‌ఎంబీ) అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్‌ఎం), ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, మానవ వనరుల నిర్వహణ, ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు, సేవలందిస్తుంటుంది. అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ (Oracle Corporation ) 2016 నవంబరులో నెట్‌సూట్‌ను 930 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది.