Kishan Reddy: ఇది కేంద్ర ప్రభుత్వ పథకం.. దైర్యముంటే ఆపు : కిషన్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హద్దులు దాటి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌కు ఓటేయకపోతే సన్న బియ్యం పథకాన్ని రద్దు చేస్తామని బెదిరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. ఇది కేంద్ర ప్రభుత్వం పథకమని, ధైర్యముంటే రద్దు చేసి చూపాలని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) తో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ (Jubilee Hills) లో మజ్లిస్ అభ్యర్థిని కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుని నిలబెట్టినా, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినా, గెలుస్తామో లేదోనన్న అనుమానంతో, భయం తో కాంగ్రెస్‌కు ఓటేయకపోతే సన్న బియ్యం పంపిణీ మానేస్తామంటూ రేవంత్‌రెడ్డి బెదిరించడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. ప్రతి కిలోకు రూ.42 చొప్పున ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.15 మాత్రమే భరిస్తోంది. ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు.







