KTR: 500 రోజుల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం : కేటీఆర్
హైడ్రా బుల్డోజర్లు పేదల ఇళ్లను కూల్చేశాయని, ఎన్నో కుటుంబాలను వీధిన పడేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. పెద్దవాళ్లకు ఒక న్యాయం, పేదవాళ్లకు ఒక న్యాయం పేరిట హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ (Exhibition) ఏర్పాటు చేశారు. కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 500 రోజుల్లో కేసీఆర్ (KCR) ప్రభుత్వం మళ్లీ వస్తుందని, హైడ్రా (Hydra) కూల్చివేతలతో అన్యాయానికి గురైన బాధితులందరికీ అండగా నిలుస్తామని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలకు ఎంతోమంది బాధితులుగా మారారు. చాంద్రాయగుట్టలో పాఠశాల భవనాన్ని కూడా కూలగొట్టారు. కేసీఆర్ హయాంలో ఎక్కడా చూసినా కట్టడాలే కనిపించేవి. హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాం. వైట్‌హౌస్ ను తలదన్నేలా సచివాలయం, దేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నారుం. హైదరాబాద్‌లో 42 ఫైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాం. ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కట్టాం. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామన్నారు.







