Global Economy: గల్ఫ్ రణరంగంతో గ్లోబల్ ఎకానమీకి ముప్పు.. ఐఎంఎఫ్ హెచ్చరికలు!
పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ వాతావరణం, దాడుల పరంపరపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నామని మంగళవారం నాటి ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ సంక్షోభం కారణంగా పశ్చిమాసియాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు (Global Economy) వాటిల్లే కచ్చితమైన నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదని, అలా అంచనా వేయడం తొందరపాటే అవుతుందని స్పష్టం చేసింది.
ఇప్పటికే కునారిల్లిన ఆర్థిక వ్యవస్థ..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గ్లోబల్ ఎకానమీ (Global Economy) ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని, అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఈ విపత్కర తరుణంలో మధ్యప్రాచ్యంలో రగులుతున్న తాజా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత లోతైన కష్టాల్లోకి నెట్టే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ప్రస్తుత దాడుల వల్ల ప్రధానంగా ముడిచమురు (ఇంధన) ధరలు భగ్గుమంటున్నాయని, వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ఫైనాన్షియల్ మార్కెట్లలో భారీ అస్థిరత నెలకొందని పేర్కొంది.
ద్రవ్యోల్బణం ముప్పు, మార్కెట్ల పతనం..
ఈ యుద్ధం ఎంతకాలం పాటు కొనసాగుతుందనే దాన్ని బట్టే ప్రపంచానికి వాటిల్లే ఆర్థిక నష్టం (Global Economy) ఆధారపడి ఉంటుందని ఐఎంఎఫ్ విశ్లేషించింది. ఈ దాడుల భయంతో అంతర్జాతీయంగా సరుకు రవాణా (సప్లై చైన్) మార్గాలకు భారీ ఆటంకాలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. సరుకుల సరఫరా కుంటుపడటంతో పాటు రవాణా (ఫ్రైట్) ఖర్చులు అమాంతం పెరుగుతాయని, దీని పరిణామంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం (Inflation) మళ్లీ పడగవిప్పే ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
మరోవైపు ఈ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్టర్లు (Global Economy) అప్రమత్తమవుతారని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. వారు తమ పెట్టుబడులను రిస్క్‌తో కూడిన ఈక్విటీల నుంచి భారీగా ఉపసంహరించుకుని, సురక్షిత పెట్టుబడి సాధనాల (Safe-haven assets) వైపు మళ్లిస్తారని తెలిపింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు (Global Economy) భారీ నష్టాలను చవిచూసే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ తన నివేదికలో స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
