అమెరికా దౌత్యాధికారులను ప్రాసిక్యూట్ చేస్తాం : రష్యా
రష్యాలో పనిచేస్తున్న ముగ్గురు అమెరికా దౌత్యధికారులను ప్రాసిక్యూట్ చేస్తామని పుతిన్ ప్రభుత్వం యూఎస్ ఎంబసీని హెచ్చరించింది. ఈ ముగ్గురికున్న డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ ( దౌత్యపరమైన రక్షణ)ను తొలగించాలని ఎంబసీని కోరింది. వీరు దొంగతనాలు చేస్తున్నారని రష్యా అనుమానిస్తోంది. ఇటీవల రష్యా అధికారులపై నాటో తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా రష్యా ఈ ముగ్గురిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా ఎంబసీని కోరింది. ఒక రష్యన్‌కు చెందిన బ్యాక్‌ప్యాక్‌ను అమెరికా దౌత్యసిబ్బంది దొంగలించడం సీసీటీవీలో నమోదైందని, ఈ ప్యాక్‌లో సుమారు 15 వేల రూబుల్స్ ఉన్నాయని తెలిసింది. దొంగతనం రుజువైతే రష్యాలో ఐదేళ్లవరకు జైలు శిక్ష విధిస్తారు.






