New York: ట్రంప్.. మమ్దానీ.. న్యూయార్క్ ను ఒడ్డున పడేస్తారా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. దేశం ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలకు వలసదారులే కారణమని నిందిస్తున్నారు. వారి నుంచి అమెరికన్లకు రావాల్సిన ఉద్యోగాలు రాకుండాపోతున్నాయంటూ .. హెచ్ 1 బీ వీసా ధర పెంపు అస్త్రాన్ని తీవ్రంగా ప్రయోగించారు. తద్వారా తెల్లజాతీయులు, అమెరికన్ల ఆదరణ చూరగొంటున్నారు. మరోవైపు .. మమ్దానీ రిచ్ , పూర్ అస్త్రాన్ని ప్రయోగించి న్యూయార్క్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇద్దరూ తమ రాజకీయాల్లో చేయి తిరిగిన వారే.. ఈ ఇద్దరూ కలిసి న్యూయార్క్ సిటీని గాడిన పెట్టాలని సిటీ వాసులు కోరుకుంటున్నారు.
ఎన్నికల సమయంలో మమ్దానీ.. చాలా ప్రామిస్ లు చేశారు. వాటన్నింటినీ నెరవేర్చేందుకు చాలా నిధులు కావాల్సి ఉంటుంది. ప్రస్తుత తరుణంలో వాటన్నింటినీ రాష్ట్రం సొంతంగా సమకూర్చుకోవాలి. లేదంటే అమెరికా ప్రభుత్వం నుంచి నిధులు అందాలి. మరి వాటిని ఎలా మమ్దానీ సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ట్రంప్ స్వయంగా ఓ బిజినెస్ మెన్. మరి ఆయన నుంచి ఈ తరహా సాయం ఎలా అందుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్.
మరింత ముఖ్యమైంది వలసదారుల గుర్తింపు.. వారిని తరలించడం గురించి.. అక్రమవలసలపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్.. ఇప్పుడు న్యూయార్క్ కు బలగాలు పంపిస్తారా…? ఓవేళ పంపిస్తే.. మమ్దానీ ఎలా స్పందిస్తారు. వీరి సరదా కలయిక.. ఆసమయంలో ఎలాంటి పరిష్కారాన్ని చూపించే అవకాశం లేదన్నది అమెరికా రాజనీతిజ్ఞుల మాట.
ప్రపంచీకరణ అనంతర కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన లక్షలాది మందికి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి .. ఈ ఇద్దరు నేతలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. AI సునామీ వల్ల తుడిచిపెట్టుకుపోయిన ఉద్యోగాల గురించి చెప్పనవసరం లేదు. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల ఈ సవాలును ఎదుర్కోవడంలో ప్రపంచంలోని అతిపెద్ద ద్రవ్య సంస్థ అసమర్థతను అంగీకరించారు, AI ఉద్యోగ సృష్టిని సున్నాకి దగ్గరగా ఉంచిందని అన్నారు.
అమెరికాలో అత్యంత ధనవంతులు, రాజకీయంగా ముందంజలో ఉన్నవారికి నిధులు సమకూర్చడం ద్వారా లేదా వనరులను నియంత్రించడం ద్వారా, పాలనా విధానాలను నిర్దేశిస్తున్నారు. అమెరికాలో ఎన్నికల్లో గెలవాలంటే, బిలియనీర్ మద్దతు అవసరం . వారి ఫండింగ్ కూడా చాలా అవసరం. తర్వాత వారి బిజినెస్ కు కావాల్సిన చేయూత ఈ లీడర్లు అందించాల్సి ఉంటుంది..
ఒక వలసదారుడిగా.. ట్రంప్ యొక్క MAGA యొక్క వలస వ్యతిరేక విధానాల గురించి తెలుసుకోవడం కష్టం. కానీ 1980ల నాటి ఉదారవాద పూర్వ సోషలిస్ట్ భారతదేశంలో పెరిగిన వ్యక్తిగా, మమ్దానీ ఆర్థిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. సోషలిస్ట్ ప్రజాస్వామ్యంతో భారతదేశం యొక్క స్వంత విఫలమైన ప్రయోగం దాని సామ్రాజ్యవాదులకు అపరిమిత అధికారాన్ని పొందేందుకు వీలు కల్పించింది, వారి ప్రభావం నేటికీ అన్ని రంగాల్లో కొనసాగుతోంది.
అయితే..”అమెరికాలో జరిగే గొప్ప మార్పులన్నీ విందు టేబుల్ వద్దే ప్రారంభమవుతాయి” అని రోనాల్డ్ రీగన్ ప్రముఖంగా అన్నారు. వీరి కలయిక.. న్యూయార్క్ వాసుల సమస్యలను దూరం చేసే దిశగా సాగాలన్నది సగటు అమెరికన్, న్యూయార్క్ వాసి ఆశ. మరి అది ఎంతవరకూ సాధ్యమవుతుందో వేచి చూడాలి.






