TTD: టీటీడీకి ప్రవాస భారతీయుడు ..రూ.9 కోట్లు విరాళం
తిరుమలలోని పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునికీకరణకు ప్రవాస భారతీయుడైన రామలింగరాజు మంతెన (Ramalinga Raju Mantena) రూ.9 కోట్లు విరాళం అందజేశారు. తన కుమార్తె నేత్ర (Netra), అల్లుడు వంశీ (Vamsi) పేరిట దీన్ని ఇచ్చారు.2012లోను ఆయన రూ.16 కోట్లు విరాళం అందజేశారు. సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో భారీ విరాళం అందజేసిన దాతకు టీటీడీ తరపున అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప విరాళాలను దాత అందిస్తారని ఆశిస్తున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu)తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పలనాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.






