Chandrababu: విజన్ ఉంటే సరిపోదు .. దాన్ని అమలు చేయడం ముఖ్యం : సిఎం చంద్రబాబు
ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా ఉండిపోతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ (Mock assembly) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ విజన్ ఉంటే సరిపోదు, దాన్ని అమలు చేయడం ముఖ్యం. నిరంతర శ్రమతోనే అనుకున్నది సాధించగలం. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు వెళ్లాలి. చిన్న వయసులోనే నేను ఎమ్మెల్యే (MLA) అయ్యాను. నాలుగో సారి సీఎం (CM) గా పనిచేస్తున్నాను. మాక్ అసెంబ్లీలో విద్యార్థులు చాలా బాగా మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడలేదు. బాధ్యత గుర్తుపెట్టుకునేలా, స్ఫూర్తినిచ్చేలా మాక్ అసెంబ్లీ నిర్వహించారు అని అన్నారు.






