KTR: రిజర్వేషన్ల తగ్గింపుపై రాహుల్ గాంధీ స్పందిస్తారా?: కేటీఆర్
తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గొప్పగా చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీసీ (BC)లకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. రూ.160 కోట్లు ఖర్చు చేశారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat elections) వారికి కేవలం 17 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. బీసీలకు ఉన్న 24 శాతాన్ని 17 శాతానికి తగ్గించారు. రిజర్వేషన్లు తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ గాంధీ స్పందిస్తారా అని ప్రశ్నించారు.






