Home Minister Anita: శాంతిభద్రతలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత : హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anita) అన్నారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ (Principal Secretary), స్పెషల్ సెక్రెటరీతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు, నేర నియంత్రణ, టెక్నాలజీ వినియోగం, పోలీసు (Police) విభాగానికి చెందిన వనరులపై చర్చించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ నేర నియంత్రణకు సాంకేతికత, వసతుల విషయంలో ప్రభుత్వం రాజీ పడబోదన్నారు. త్వరలో అన్ని పీఎస్లకు కొత్త వాహనాల (New vehicles) కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.






