TTA: టీటీఏ, ఐఎంఏ, ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘అడ్వాన్సెస్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్’ సదస్సు!
వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం ‘అడ్వాన్సెస్ ఇన్ క్లినికల్ ప్రాక్టీస్’ పేరిట ముఖ్యమైన సదస్సు డిసెంబర్ 13వ తేదీన జరగనుంది. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) హైదరాబాద్ నార్త్ చాప్టర్, ఏఐజీ (AIG) హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి 2 క్రెడిట్ అవర్స్ లభించే ఈ సదస్సు, డిసెంబర్ 13, శనివారం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:45 గంటల వరకు గచ్చిబౌలి ఏఐజీ (AIG) హాస్పిటల్స్ ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ఉచితం, అయితే సదస్సుకు హాజరవ్వాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
ఈ సదస్సుకి పేట్రన్‌గా డా. దువ్వూరు నాగేశ్వర రెడ్డి, కన్వీనర్‌గా డా. దువ్వూరు ద్వారకనాథ రెడ్డి వ్యవహరిస్తున్నారు. టీటీఏ (TTA) నుండి మల్లారెడ్డి పైళ్ల, విజయపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి పాతలోళ్ల, భరత్ రెడ్డి మాదాడి, శ్రీని అనుగు, నవీన్ రెడ్డి మల్లిపెద్ది, విశ్వ కంది, నరసింహ రెడ్డి దొంతిరెడ్డి వంటి ప్రముఖులు, ఐఎంఏ (IMA) హైదరాబాద్ నార్త్ నుండి పాటూరి విష్ణుప్రియ రావు, చాపరాల సురేంద్రనాథ్, గంగాధరి రామస్వామి గణేష్ రావు, వంకినేని సాయి సుధాకర్, సిరిపల్లి వివేక్ చంద్రరావు, మల్లె నర్సింగ్ రావు, కంది సుభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఏఐజీ (AIG) హాస్పిటల్స్ తరఫున అనురాధ శేఖరన్, కలంబూర్ నరసింహన్ పాల్గొననున్నారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం డా. సి. సురేంద్రనాథ్, హరి ప్రసాద్, రాకేష్, వెంకన్నలను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.






