Naveen Polishetty: సింగర్ గా మారుతున్న నవీన్ పోలిశెట్టి
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ(Agent Sai Srinivasa Athreya), జాతిరత్నాలు(Jathiratnalu) సినిమాలతో హీరోగా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి(naveen polishetty) ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr. Polishetty) మూవీతో మరో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ప్రస్తుతం నవీన్ హీరోగా వస్తున్న సినిమా అనగనగా ఒక రాజు(Anngana oka raju). కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మారి(mari) దర్శకత్వం వహిస్తున్నారు.
వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు నవీన్ పోలిశెట్టి. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్స్ విషయంలో నవీన్ ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా నవీన్ అంతే కష్టపడుతున్నారు. దానికి తోడు ఈ సినిమాతో నవీన్ సింగర్ గా మారబోతున్నాడు.
ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడిస్తూ మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో నవీన్ పాడిన భీమవరం బల్మా(Bhimavaram Balma) సాంగ్ ను నవంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్టు ఓ ఇంట్రెస్టింగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. పండక్కి స్టెప్పులేయడానికి రెడీగా ఉండమని చెప్తూ ప్లే బ్యాక్ సింగర్ కావడానికి నవీన్ పోలిశెట్టి పడుతున్న కష్టాలను చూపిస్తూ భలే ఫన్నీగా ఓ వీడియోను రిలీజ్ చేయగా, ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainmets) నిర్మిస్తోంది.
https://x.com/SitharaEnts/status/1993239660718674019?s=20






