YS Jagan: మన ప్రభుత్వ వస్తుంది. అధైర్యపడొద్దు : వైఎస్ జగన్
మన ప్రభుత్వం వస్తుంది, అధైర్యపడొద్దు, అంతా మంచే జరుగుతుంది అని వైసీపీ కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. కడప జిల్లా పులివెందుల (Pulivendula) కు తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. పలువురు కార్యకర్తలు ఆయనకు పలు సమస్యలను విన్నవించారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అంతా ధైర్యంగా ఉండాలని, మన ప్రభుత్వం రాగానే అందరికీ మంచి జరుగుతుందని అన్నారు. వైసీపీ (YCP) కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. వారంతా ఒక్కసారిగా కిటికీల మీద పడడంతో అద్దాలు పగిలిపోయాయి. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ వారిని చెదరగొట్టారు.






