Modi: శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ (Safran Aircraft Engine Services) ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ సాఫ్రాన్ సంస్థలకు కేంద్రం సహాయ సహకారాలు అదిస్తుందని తెలిపారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పటికే భారత్ 1500 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్ ఇచ్చిందని వివరించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ల సర్వీస్‌సెంటర్ భారత్‌లో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ (MSME)లను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. కొన్ని రంగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు చెప్పారు.






