Suryakumar Yadav: బుమ్రాను వాడుకోవడంలో వైఫల్యం వల్లే ఓడిపోయాం: మహ్మద్ కైఫ్
టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో భాగంగా అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఎదుర్కొన్న 76 పరుగుల పరాజయం క్రీడాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ ఓటమిపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ సేవలను సూర్య సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయాడని ఆయన విశ్లేషించాడు.
చేజారిన కీలక మిడిల్ ఓవర్లు..
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా కైఫ్ మ్యాచ్‌ను విశ్లేషిస్తూ.. 7 నుంచి 15 ఓవర్ల మధ్యే టీమిండియా మ్యాచ్‌పై పూర్తిగా పట్టు కోల్పోయిందని స్పష్టం చేశాడు. మ్యాచ్ ఆరంభంలో దక్షిణాఫ్రికా 3.6 ఓవర్లకే కేవలం 20 పరుగులు చేసి 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ పరిస్థితిని చక్కదిద్దారు. వీరు నాలుగో వికెట్‌కు 50 బంతుల్లోనే 97 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ ప్రమాదకర జోడీని విడగొట్టడానికి సరైన సమయంలో బుమ్రాను బరిలోకి దించడంలో సూర్య (Suryakumar Yadav) విఫలమయ్యాడని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రోహిత్ వ్యూహం డిఫరెంట్..
ఈ సందర్భంగా కైఫ్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలను గుర్తుచేశాడు. “సూర్యకుమార్ (Suryakumar Yadav) మ్యాచ్ మొదట్లోనే బుమ్రాతో వరుసగా రెండు ఓవర్లు వేయించాడు. ఆ తర్వాత మిగిలిన రెండు ఓవర్లను డెత్ ఓవర్ల కోసం దాచాడు. దీనివల్ల రెండు స్పెల్స్ మధ్య చాలా గ్యాప్ ఏర్పడింది. అదే రోహిత్ శర్మ అయితే ఎప్పుడూ బుమ్రాను ఇలా అప్రాధాన్యంగా వాడేవాడు కాదు. ప్రత్యర్థి బ్యాటర్ల భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో, దాన్ని బ్రేక్ చేయడానికి కచ్చితంగా మ్యాచ్ మధ్యలో బుమ్రా చేతికి బంతిని ఇచ్చేవాడు” అని కైఫ్ తెలిపాడు. టీమిండియాలో బుమ్రాను మించిన మ్యాచ్ విన్నర్ లేడని, అతడితో పవర్‌ప్లేలో కేవలం ఒక ఓవర్ మాత్రమే వేయించి, మిగతా ఓవర్లను 11 లేదా 12వ ఓవర్ల సమయంలో వాడి ఉంటే ఫలితం భారత్‌కు అనుకూలంగా ఉండేదని సూచించాడు.
ఇవి కూడా చదవండి
