T20 World Cup: ఆ ఇద్దరినీ వాడుకోండి గంభీర్..!
టి20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు చిన్న జట్లపై గెలిచిన భారత జట్టుకు.. ఇప్పుడు పెద్ద జట్లతో పోటీ ఎదురవుతున్న సమయంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జట్టులోని కీలక ఆటగాళ్లు కూడా రాణించలేని పరిస్థితిలో ఉండటం పట్ల.. అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. కీలక సమయంలో స్టార్ ఆటగాళ్లు చేతులెత్తేయటంపై అభిమానులు మండిపడుతున్నారు. గతంలో విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) మాదిరిగా జట్టును ఆదుకునే ఆటగాడు లేడు అంటూ చాలామంది క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
దీనిపై మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక జట్టులో కీలక మార్పులు చేయాలంటూ పలువురు మాజీ ఆటగాళ్లు కూడా సూచిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టు నుంచి తిలక్ వర్మను తప్పించాలి అనే డిమాండ్ వినపడుతోంది. అదేవిధంగా అభిషేక్ శర్మని కూడా పక్కన పెట్టాలని, క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. అభిషేక్ శర్మ స్థానంలో సంజు సామ్సన్ కు అవకాశం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.
ఇదే సమయంలో.. తిలక్ వర్మ(Tilak Varma) స్థానంలో.. వాషింగ్టన్ సుందర్(Washington Sundar) ను ఆడించాలని, సుందర్ స్థానంలో అక్షర్ పటేల్ ఆడితే బాగుంటుందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వాషింగ్టన్ సుందర్ మూడవ స్థానంలో ఆడితే.. మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పవచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆటగాడిగా పేరున్న సుందర్ ను సరిగా జట్టు అవసరాల కోసం వాడుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి.

అదే విధంగా రింకు సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తే మంచి ఫలితం ఉండవచ్చు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కుల్దీప్ ను బ్యాటింగ్ లో కాస్త షైన్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు. అలాగే హైదరాబాది స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. సిరాజ్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని, సీనియర్ బౌలర్ బూమ్రాకు అవసరమైతే రెస్ట్ ఇచ్చి.. సిరాజ్ ను జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి