SA vs NZ: ఫైనల్ బెర్తే లక్ష్యంగా సఫారీలతో కివీస్ ఢీ.. నేడే తొలి సెమీస్!
టీ20 వరల్డ్ కప్‌లో తుది పోరుకు (ఫైనల్) అర్హత సాధించడమే లక్ష్యంగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా (SAvsNZ) జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు ఈ రెండు జట్ల మధ్య తొలి సెమీ-ఫైనల్ సమరం జరగనుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. ఎలాగైనా తమ చిరకాల కలను నెరవేర్చుకోవాలన్న కసితో ఉన్న ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగనుంది.
ఫేవరెట్‌గా బరిలోకి సౌతాఫ్రికా..
ఈ టోర్నీలో (SAvsNZ) సఫారీ సేన జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆడిన ఏడు మ్యాచుల్లోనూ గెలిచి, అజేయ జట్టుగా సెమీస్‌లో అడుగుపెట్టింది. డికాక్, మార్క్రమ్, రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ లాంటి పవర్హిట్టర్లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ అత్యంత ప్రమాదకరంగా ఉంది. వెస్టిండీస్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించిందంటే ఆ జట్టు బ్యాటింగ్ డెప్త్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలింగ్‌లోనూ రబాడ, ఎంగిడి, కార్బిన్ బోష్, కేశవ్ మహారాజ్ లాంటి వారితో జట్టు (SAvsNZ) పూర్తి సమతూకంతో కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
కివీస్‌కు పోరాటం తప్పనిసరి..
మరోవైపు న్యూజిలాండ్ (SAvsNZ) జట్టు కాస్త అదృష్టంతోనే సెమీస్ బెర్త్ దక్కించుకుంది. శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడం కివీస్‌కు కలిసొచ్చింది. ఈ మ్యాచ్‌లో బలమైన సఫారీలను నిలువరించాలంటే కివీస్ శక్తికి మించి పోరాడక తప్పదు. జట్టులో స్టార్ బ్యాటర్లు ఫిన్ అలెన్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్రలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. గ్లెన్ ఫిలిప్స్, సీఫెర్ట్ మాత్రమే కాస్త అండగా నిలుస్తున్నాడు. బ్యాట్‌తో విఫలమవుతున్న రచిన్ రవీంద్ర.. బౌలింగ్‌లో మాత్రం 5 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలవడం కివీస్‌కు (SAvsNZ) ఏకైక ఊరట. కెప్టెన్ సాంట్నర్, ఫెర్గూసన్, ఇష్ సోధి వంటి బౌలర్లు సత్తా చాటాల్సిన అవసరం ఉంది.
సఫారీలదే ఆధిపత్యం..
అంతర్జాతీయ టీ20ల్లో ఈ రెండు జట్లు (SAvsNZ) 19 సార్లు ముఖాముఖి తలపడగా.. సౌతాఫ్రికా 12 సార్లు, కివీస్ కేవలం 7 సార్లు మాత్రమే గెలుపొందాయి. ఇక టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అయితే కివీస్‌పై సౌతాఫ్రికాకు తిరుగులేని రికార్డు ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ సఫారీలే విజయకేతనం ఎగురవేశారు. ఈ టోర్నీ గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా (SAvsNZ) 7 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది.
తుది జట్లు (అంచనా):
సౌతాఫ్రికా: మార్క్రమ్ (కెప్టెన్), డికాక్, రికెల్టన్, బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, జాన్సెన్, కార్బిన్ బోష్, రబాడ, మహారాజ్, ఎంగిడి.
న్యూజిలాండ్: సాంట్నర్ (కెప్టెన్), సీఫెర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మెన్, మెక్కాంచీ/నీషమ్, హెన్రీ/డఫీ, ఇష్ సోధి, ఫెర్గూసన్.
ఇవి కూడా చదవండి
