ఐపీఎల్ ప్లేయర్లకు అందమైన అమ్మాయిల ఎర..?
ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, తెరవెనుక జరుగుతున్న కొన్ని ఆందోళనకర పరిణామాలు క్రికెట్ వర్గాలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా స్టార్ క్రికెటర్లను బుట్టలో వేసుకునేందుకు ‘హనీ ట్రాప్’ (Honey Trap) ముఠాలు పొంచి ఉన్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అప్రమత్తమైంది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు 8 పేజీల సుదీర్ఘ హెచ్చరిక లేఖను పంపారు.
హై-ప్రొఫైల్ స్పోర్ట్స్ ఈవెంట్లలో ఆటగాళ్లను తప్పుదోవ పట్టించి, వారి నుంచి రహస్యాలు రాబట్టేందుకు లేదా వారిని బ్లాక్మెయిల్ చేసేందుకు ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయని బీసీసీఐ తన లేఖలో స్పష్టంగా పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని, లైంగిక ఆరోపణలు లేదా చట్టపరమైన చిక్కుల్లో ఆటగాళ్లను ఇరికించే ప్రమాదం ఉందని లేఖలో హెచ్చరించారు. ఈ ముప్పును అరికట్టేందుకు బీసీసీఐ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. దీని ప్రకారం, టీమ్ మేనేజర్ ముందస్తు అనుమతి లేకుండా ఆటగాళ్ల గదుల్లోకి ఎవరినీ రానివ్వకూడదు.
అలాగే, హోటల్ గదుల్లో ఎప్పుడైనా బీసీసీఐ టాస్క్ ఫోర్స్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయని, నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాతో పాటు సస్పెన్షన్ వేటు తప్పదని స్పష్టం చేసింది. మరోవైపు, ఆటగాళ్ల క్రమశిక్షణపై కూడా బోర్డు ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల కొంతమంది ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లు లేదా విమానాల్లో వేపింగ్ (e-cigarette) చేస్తూ కనిపించిన నేపథ్యంలో, బీసీసీఐ దీనిపై కఠిన హెచ్చరికలు జారీ చేసింది. డ్రెస్సింగ్ రూమ్స్, డగౌట్స్ లేదా టీమ్ హోటళ్లలో ఈ-సిగరెట్లు లేదా నిషేధిత పదార్థాలు వాడితే వాటిని ‘క్రిమినల్ అఫెన్స్’ (నేరం) కింద పరిగణిస్తామని లేఖలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
