ఐపీఎల్ 2026 క్లైమాక్స్‌కు రంగం సిద్ధం.. ఫైనల్ ఎక్కడంటే..?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ ముగింపు దశకు చేరుకుంది. టోర్నీలో అత్యంత కీలకమైన ప్లే ఆఫ్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ అధికారికంగా ఖరారు చేసింది. ఈసారి ప్లే ఆఫ్(Play Off) పోరు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు గుజరాత్లో హోరాహోరీగా సాగనుంది. ముఖ్యంగా ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు మరోసారి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ(narendra Modi) స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. షెడ్యూల్ ప్రకారం, మే 26న ధర్మశాల వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది.
పర్వతాల మధ్య అందమైన లొకేషన్లో ఉండే ధర్మశాల స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తలపడనున్నాయి. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. అనంతరం మే 27న ఛండీగఢ్‌లో ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించనున్నారు. లీగ్ దశలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఓడిపోయిన జట్టు ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక మే 29న ఛండీగఢ్‌లోనే క్వాలిఫయర్-2 మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మరియు క్వాలిఫయర్-1లో ఓడిపోయిన జట్టు మధ్య ఇక్కడ పోరు సాగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అంటే ఛండీగఢ్ నగరం వరుసగా రెండు కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లకు వేదిక కాబోతోంది. చివరగా, అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే గ్రాండ్ ఫైనల్ మే 31న అహ్మదాబాద్‌లో జరగనుంది. లక్షలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది. ప్రస్తుతం లీగ్ దశలో జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో, ప్లే ఆఫ్ చేరే ఆ నాలుగు జట్లు ఏవనేది క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. ఈ వేదికల ఖరారుతో అభిమానులు ఇప్పుడే టికెట్ల బుకింగ్ మరియు ప్రయాణ ప్రణాళికల్లో నిమగ్నమయ్యారు.
ఇవి కూడా చదవండి
