దీనికి రాజకీయ రంగు పులమొద్దు: సుప్రీంకోర్టు

మత మార్పిళ్ల అంశం చాలా తీవ్రమైందని, దీనికి రాజకీయ రంగు పులమడం సమంజసం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మోసపూరిత మతమార్పిళ్లకు వ్యతిరేకంగా కేంద్రం చర్యలు తీసుకోవాలంటూ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సి.టి.రవికుమార్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషన్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించిన న్యాయవాది, దీన్ని రాజకీయ దురుద్దేశాలతో బీజేపీకి చెందిన వ్యక్తి దాఖలు చేశారని పేర్కొన్నారు. రాజకీయ రంగు తేవద్దు. పిటిషనర్ బీజేపీకి చెందిన వ్యకైనా వింటా అని ధర్మాసనం తెలిపింది. కోర్టు సహాయకుడిగా వ్యవహరించాల్సిందిగా అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిని న్యాయమూర్తులు కోరారు. బలవంతంగా ఏదైనా ఆశ చూపి మతం మారిస్తే ఏం చేయాలి? ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి? వంటి విషయాల్లో న్యాయస్థానానికి మీరు సాయం చేయాలి అని ఏజీకి సూచించారు.