India: రష్యాతో భారత్ చర్చలు!

గనతలాన్ని మరింత దుర్భేద్యం చేసే లక్ష్యంతో మనదేశం అడుగులు వేస్తోంది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో పాకిస్థాన్‌కు దడ పుట్టించిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలను రష్యా నుంచి మరిన్ని కొనడానికి సిద్ధమైంది. ఈ కొనుగోళ్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయని రష్యా మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి దిమిత్రీ షుగయేవ్ (Dmitry Shugayev) ధ్రువీకరించారు. టాస్ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే భారత్ (India) వద్ద ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఈ విషయంలో సహకారాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. అంటే మరిన్ని సరఫరా చేస్తాం. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్నాం అని పేర్కొన్నారు. చైనాలో ఎస్‌సీఓ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) తో ప్రధాని మోదీ భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.