Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో బేబిగ్ కంపెనీ ప్రతినిధుల భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని జూబ్లీహిల్స్ నివాసంలో జర్మనీ (Germany) కి చెందిన బేబిగ్ మెడికల్ కంపెనీ (Babyg Medical Company) చైర్మన్, సీఈవో జార్జ్ చాన్ (George Chan) బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణలో మెడికల్ ఎక్విప్‌మెంట్ ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించడానికి బేబిగ్ ఆసక్తి చూపగా, అందుకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి రిపోర్టు అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ ఎక్విప్‌మెంట్ (Medical equipment) తో పాటు క్యాన్సర్ చికిత్సకు ఉపయోపగడే రేడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.