India:భారత్ మరో భారీ డీల్.. రష్యాతో?

అమెరికాతో టారిఫ్స్ యుద్ధం, పాకిస్థాన్ (Pakistan) తో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా పేరుగాంచిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ అదనపు యూనిట్స్ని రష్యా (Russia) నుంచి మరిన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయమై మాస్కో (Moscow) తో చర్చలు ప్రారంభించింది. భారత్ అదనపు ఎస్-400 వ్యవస్థల కొనుగోళ్లకు రష్యా తో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. భారత్ ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.