Donald Trump: డొనాల్డ్ ట్రంప్ దెబ్బ.. 60 ఏళ్ల తర్వాత తొలిసారి!

అమెరికాకు వలస వచ్చే వారి సంఖ్య తగ్గిపోవడం, జననాల రేటు తక్కువగా ఉండడంతో తొలిసారిగా 2025లో ఆ దేశ జనాభా(Population) తగ్గనున్నట్లు అమెరికన్ ఎంటర్‌ప్రైజ్ ఇన్‌స్టిట్యూట్(ఏఈఐ) అంచనా వేస్తోంది. ఈ సంవత్సరం ఆ దేశానికి వలస వచ్చే వారి సంఖ్య 5,25,000 కన్నా తక్కువగా ఉండవచ్చని ఏఈఐ (AEI) తెలిపింది. దీనికితోడు గత ఏడాది జనాభా లెక్కల ప్రకారం 5,19,000 జననాలు మాత్రమే నమోదయ్యాయి. 1960 తర్వాత ఇలా వలసదారుల సంఖ్య క్షీణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఫలితంగా అమెరికా జనాభా సంఖ్యలో 6000 మంది తగ్గిపోతారని అంచనా. 250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఇదే తొలిసారి.
అమెరికన్ సివిల్ వార్‌లో 7,00,000 మంది మరణించినప్పుడు గానీ, కోవిడ్-19 పెండెమిక్ సమయంలో గానీ అమెరికన్ జనాభా తగ్గుముఖం పట్టకుండా ఏటా పెరుగుతూనే వచ్చింది. కాగా, అమెరికా (America) లో రాబోయే 30 ఏళ్ల వరకు జననాల రేటు 1.6గానే ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీ్‌స(ఐఎ్‌ఫఎస్) సంస్థ సర్వే తెలియజేస్తోంది. ఇది జనాభాసంఖ్య నిలకడగా కొనసాగడానికి ప్రతి మహిళకు ఉండాల్సిన పిల్లల సంఖ్య 2.1కన్నా తక్కువ. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత దాదాపు 20 లక్షల మంది వలసదారులు అమెరికాను వీడి వెళ్లిపోయారు.