AP Assembly: 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Assembly) సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత 16వ శాసనసభకు సంబంధించి 4వ సెషన్ 18న ఉదయం 9 గంటలకు ప్రారంభించేందుకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అనుమతించిన ఉత్తర్వులను అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ (Suryadevara Prasanna Kumar) విడుదల చేశారు. శాసనమండలి (Legislative Council) 48వ సెషన్ కూడా 18న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశాలను ఏడు లేదా పది పనిదినాలు నిర్వహించే అవకాశం ఉందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో వాటికి సంబంధించిన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ఇవేకాకుండా మరికొన్ని బిల్లులు కూడా సభ ముందుకు వచ్చే అవకాశముంది.