Ravi Teja: రేటు తగ్గించిన రవితేజ
సక్సెస్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే రవితేజ(raviteja) గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. రవితేజ మాస్ సినిమాలు చేస్తే వాటిలో ఎక్కువగా హిట్టే అవుతాయి. కానీ రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర(mass jathara) రవితేజకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మాస్ జాతర తర్వాత రవితేజ కిషోర్ తిరుమల(Kishore Tirumala) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
దాని తర్వాత రవితేజ, శివ నిర్వాణ(Siva nirvana)తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. శివతో పాటూ మ్యాడ్(mad) డైరెక్టర్ కళ్యాణ్ శంకర్(kalyan Shankar) కూడా రవితేజతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని అంటున్నారు. పైగా వరుస ఫ్లాపుల కారణంగా రీసెంట్ గా రవితేజ కూడా తన రెమ్యూనరేషన్ కు కాస్త తగ్గించాడని, మొన్నటివరకు రూ.25 కోట్లు లేనిదే సినిమా చేయనని చెప్పిన రవితేజ ఇప్పుడు రూ.20 కోట్లు అది కూడా ప్రాఫిట్ షేర్ అంటున్నాడని తెలుస్తోంది.
వరుస ఫ్లాపులు రవితేజలో మార్పును తెచ్చాయని తన రెమ్యూనరేషన్ తగ్గింపు చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో రవితేజ నెక్ట్స్ మూవీతో హిట్ కొట్టాలి, లేదంటే తన మార్కెట్ తీవ్రంగా దెబ్బతినే అవకాశముంటుంది. మరి కిషోర్ తిరుమల రవితేజకు సక్సెస్ ను ఇస్తాడా లేదా అనేది చూడాలి. అటు ఫ్యాన్స్ కూడా రవితేజ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఎంతో ఎదురుచూస్తున్నారు.







