Modi: బిహార్ యువతను గూండాలుగా మారుస్తున్నారు: విపక్షాలపై మోడీ ఫైర్
బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, ఆర్జేడీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) విమర్శల వర్షం కురిపించారు. సీతామఢి, బెట్టియాలో జరిగిన భారీ ర్యాలీల్లో పాల్గొన్న ఆయన.. విపక్షాలు రాష్ట్ర యువతను ‘గూండాలుగా’ మార్చడానికి ప్రయత్నిస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. “ఎన్డీయే ప్రభుత్వం యువతకు కంప్యూటర్లు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అందిస్తుంటే, ఆర్జేడీ మాత్రం వారికి నాటు తుపాకులు (కట్టా) ఇస్తోంది. ‘జంగిల్ రాజ్’ అంటే పిస్తోళ్లు, క్రూరత్వం, అవినీతి. వీళ్లు తమ పిల్లలను నాయకులుగా చేయాలనుకుంటారు, కానీ మీ పిల్లలను గూండాలుగా మారుస్తారు,” అని మోడీ (PM Modi) ధ్వజమెత్తారు. ఆర్జేడీ ప్రచార గీతాలు, వేదికలపై పిల్లల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ‘కట్టా సర్కార్ వద్దు, ఎన్డీయే సర్కార్ ముద్దు’ అనే కొత్త నినాదాన్ని ప్రజలకు ఇచ్చారు. నేటి బిహార్‌కు సృజనాత్మకత, స్టార్టప్‌లు అవసరమని, పాత ‘జంగిల్ రాజ్’కు ఇక్కడ చోటు లేదని మోడీ (PM Modi) స్పష్టం చేశారు.







