G20 Summit: జీ20 సదస్సుకు ట్రంప్ రావట్లేదుగా.. ‘విశ్వగురు’ వెళ్తారేమో?
ఈ నెలలో దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ20 సదస్సుకు (G20 Summit) తాను హాజరుకావడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్ విమర్శలు చేశారు. ట్రంప్ రావడం లేదు కాబట్టి.. ఈ కార్యక్రమంలో “విశ్వగురు” స్వయంగా పాల్గొంటారేమో? అంటూ ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే జీ20 సమావేశానికి (G20 Summit) హాజరు కాబోనని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో మన స్వయం ప్రకటిత విశ్వగురువు (మోడీ) ఆ సదస్సుకు నేరుగా వెళ్తారు. ఈ విషయంగా నిక్కచ్చిగా చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్‌ను ముఖాముఖిగా కలవడం ఆయనకు ఇష్టంలేదు కదా,” అని జైరాం రమేశ్ (Jairam Ramesh) తన సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.







