Aurobindo Pharma:అరబిందో ప్లాంట్ పై అమెరికా ఆంక్షలు

తెలంగాణాలోని ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మా (Aurobindo Pharma) కు అమెరికా (America) నియంత్రణ మండలి గట్టి షాకిచ్చింది. హైదరాబాద్ (Hyderabad) లో కంపెనీకి ఉన్న ప్లాంట్‌ను ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 5 వరకు తనిఖీ చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ (USFDA) ఎనిమిది అబ్జర్వేషన్లతో ఫామ్ 483 జారీ చేసింది. దీనిపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ..యూఎస్‌ఎఫ్‌డీఏ లేవనెత్తిన అనుమానాలపై త్వరలో సమాధానం ఇవ్వనున్నటు చెప్పారు.