US Tariffs: భారత్‌పై 16 శాతానికి తగ్గనున్న అమెరికా సుంకాలు!

అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) జరిగే సూచనలు కనిపిస్తున్నాయని, ఇదే జరిగితే ప్రస్తుతం భారత్‌పై అమెరికా వేస్తున్న 50 శాతం సుంకాలు (US Tariffs) చాలా తగ్గిపోతాయని సమాచారం. ఈ సుంకాలు 15-16 శాతానికి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నవంబరు కల్లా ట్రేడ్ డీల్ (Trade Deal) తొలి దశను పూర్తి చేసేందుకు ఈ రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇరుదేశాల ప్రతినిధులు మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్న నేపథ్యంలో త్వరలోనే ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నెలాఖరులో జరగనున్న ఏసియన్ శిఖరాగ్ర సమావేశం సమయంలో భారత ప్రధాని మోడీ (PM Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Doland Trump) నేరుగా కలిసి ట్రేడ్ డీల్‌పై చర్చిస్తారని సమాచారం. అప్పుడే ఈ ఒప్పందంపై అధికారిక ప్రకటన కూడా వెలువడొచ్చని తెలుస్తోంది. ఈ డీల్‌లో (Trade Deal) ఎనర్జీ, ఇంధనం, వ్యవసాయ రంగాల్లో సహకారంపై చర్చలు జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.