KTR: గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సదస్సుకు.. కేటీఆర్‌కు ఆహ్వానం

శ్రీలంకలోని కొలంబో (Colombo) లో జరగబోయే ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సదస్సు -2025లో కీలకోపన్యాసం చేయాల్సిందిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు ఆహ్వానం అందింది. నవంబరు 10 నుంచి 12 వరకూ కొలంబోలో జరగనున్న ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా శ్రీలంక (Sri Lanka) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరపున సదస్సు నిర్వాహక డైరెక్టర్ డాక్టర్ ఎ.యు.ఎల్.ఎ. హిల్మీ (Dr. A.U.L.A. Hilmi) ఆహ్వాన పత్రాన్ని పంపించారు.