Ghazal Srinivas: ప్రపంచ తెలుగు మహాసభలు… వెంకయ్యనాయుడుకు ఆహ్వానం

ఆంధ్ర సారస్వత పరిషత్ ( ఏపీ) ఆధ్వర్యంలో 2026 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు గుంటూరులోని అమరావతి శ్రీసత్యసాయి స్పిరుచువల్ సిటీ ప్రాంగణంలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. నందమూరి తారకరామారావు వేదికపై ఈ సభలు నిర్వహించనున్నారు. 5వ తేదీ సాయంత్రం జరిగే సమాపనోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని పూర్వ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కు ఆహ్వానం అందింది. పరిషత్తు అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్(Ghazal Srinivas) తన సతీమణి సురేఖ (Surekha) తో కలిసి వెంకయ్యనాయుడును కలిసి ఆహ్వానించారు. ఆయన ఎంతో సానుకూలంగా స్పందించినట్లు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.