With Love: ‘విత్ లవ్’ అందరూ కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ – రానా దగ్గుబాటి
అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘విత్ లవ్’ (With Love). మదన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. ‘విత్ లవ్’ చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. అందరికీ హాయ్. చెప్పలేని ప్రేమ గురించి ఇక్కడ అంతా చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడారు. ట్రైలర్ చూసిన అందరూ కూడా చాలా కనెక్ట్ అయ్యారు. చూస్తున్నప్పుడు ఇది మన కథే అనిపిస్తోంది. సౌందర్య గారు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్. థాంక్యూ.
హీరో అభిషన్ జీవింత్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. టూరిస్ట్ ఫ్యామిలీకి మీరందరూ గొప్ప ఆదరణ ఇచ్చారు. విత్ లవ్ కూడా చాలా అద్భుతమైన ఎమోషన్ ఉన్న సినిమా. అందరూ కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. మన జ్ఞాపకాలని నెమరు వేసుకునేలా ఉంటుంది. తప్పకుండా అందరూ ఈ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది మీ అందరికీ ఫేవరెట్ సినిమా అవుతుంది. రానా గారు ఈ సినిమాని మరింత గొప్ప స్థాయికి తీసుకువెళ్లారు. మా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాతో తెలుగులోకి రావడం చాలా ఆనందంగా ఉంది.
హీరోయిన్ అనస్వర రాజన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ట్రైలర్ చూసిన తర్వాత మీరందరూ కరెక్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్ కూడా సినిమా చూస్తున్నప్పుడు అందరు కరెక్ట్ అవుతారు. ఇది చాలా క్యూట్ సినిమా. అందరూ కూడా సినిమాని థియేటర్లో చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను హైదరాబాద్ మరోసారి రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రేమతో ఈ సినిమా చేశాం. రానా గారికి థాంక్ యూ. ఈ సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది.
ప్రొడ్యూసర్ సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాని తెలుగులోకి తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. రానా చైల్డ్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. తనతో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి చెప్పగానే తన సినిమాగా ముందుకు తీసుకొచ్చారు. ఆయన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అభిషన్ ని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తను డైరెక్ట్ గా మంచి సక్సెస్ ఇచ్చాడు. ఈ సినిమాలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. అనస్వర ఆల్రెడీ తెలుగులో సినిమాలు చేస్తోంది. ఫిబ్రవరి 6న తప్పకుండా ఈ సినిమా మీరందరూ థియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ మహేష్ రాజ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. రానా గారు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రేమతో ఈ సినిమా చేశాము. టూరిస్ట్ ఫ్యామిలీ లానే ఈ సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 6న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీరందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను.






