Vijay Devarakonda: ఈ సంవత్సరమైనా రౌడీ హీరోకి కలిసోచ్చేనా?
సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ను స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ(vijay devarakonda) పెళ్లి చూపులు(pelli choopulu) మూవీతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్న విజయ్, అర్జున్ రెడ్డి(Arjun reddy)తో భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ సక్సెస్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా కెరీర్లో ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే.
విజయ్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ అవి అనుకున్న స్థాయి ఫలితాల్ని ఇవ్వడం లేదు. ఎన్నో ఆశలతో కింగ్డమ్(kingdom) మూవీ చేస్తే అది కూడా విజయ్ ఆశలపై నీళ్లు చల్లింది. విజయ్ గత కొన్ని సినిమాలుగా సక్సెస్ అందుకోకపోయినప్పటికీ అతనికి అవకాశాల పరంగా లోటు లేదు. వరుస సినిమాలను లైన్ లో పెట్టి వాటిని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాడు.
అందులో భాగంగానే విజయ్ నుంచి ఈ ఏడాది రెండు అద్భుతమైన సినిమాలు రాబోతున్నాయి. అవే రణబాలి(ranabaali), రౌడీ జనార్థన(rowdy janardhana). ఇప్పటికే ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ కు మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాలను డైరెక్టర్లు తెరకెక్కిస్తున్నారట. అటు రౌడీ జనార్థన, ఇటు రణబాలి డైరెక్టర్లిద్దరూ ఈ సినిమాల సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, విజయ్ కూడా అదే నమ్మకంతో ఉన్నాడని తెలుస్తోంది. మరి ఈ ఇయర్ అయినా విజయ్ కు కలిసొస్తుందేమో చూడాలి.






