Ravi Shankar :గురుదేవ్ రవిశంకర్‌కు ..అమెరికాలో అరుదైన గౌరవం

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు గురుదేవ్ (Gurudev ) శ్రీశ్రీ రవిశంకర్ (Ravi Shankar ) కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ అమెరికాలోని సియాటిల్ (Seattle) నగరం అక్టోబరు 19వ తేదీన శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించడం, వివిధ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం, సమాజంలో విలువలు పెంచేందుకు ఆయన చేసిన కృషికిగాను ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలోని వాంకూవర్ నగరం సైతం అక్టోబర్ 18వ తేదీని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించింది.
ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నెలకొల్పాలనే రవిశంకర్ లక్ష్యం 180 దేశాల్లోని 8 కోట్ల మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసిందని సియాటిల్ నగర మేయర్ బ్రూస్ హారెల్ (Bruce Harrell) , వాంకూవర్ మేయర్ కెన్ సిమ్ తెలిపారు.రవిశంకర్ స్థాపించిన ఆర్ ఆఫ్ లివింగ్ సంస్థ (R of Living organization) నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన, యువ నాయకత్వ, సామాజిక అభివృద్ధి సేవా కార్యక్రమాలు ప్రజల్లో మానసిక దృఢత్వం, ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు సమాజంలో సంఘర్షణల నివారణ, శాంతి యుత వాతావరణం, మహిళా సాధికారికతను పెంపొందించాయన్నారు.