US Consulate: చెన్నైలో అమెరికా కాన్సులేట్ పునఃప్రారంభం
తమిళనాడు రాజధాని చెన్నైలోని అమెరికా కాన్సులేట్ (US Consulate) కార్యకలాపాలు పునఃప్రారంభం అయ్యాయి. గురువారం (అక్టోబర్ 23) నుంచి వీసా ప్రాసెసింగ్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా కాన్సులేట్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబరు 22న కాన్సులేట్‌ను మూసివేయడం కారణంగా రద్దయిన అపాయింట్‌మెంట్‌ల గురించి కూడా కాన్సులేట్ (US Consulate) కీలక ప్రకటన చేసింది. రద్దయిన అపాయింట్‌మెంట్‌లను త్వరలో రీషెడ్యూల్ చేస్తామని, దీనికి సంబంధించిన వివరాలను ప్రతి దరఖాస్తుదారునికి తెలియజేస్తామని వెల్లడించింది. దీంతో వీసా దరఖాస్తుదారులు, ముఖ్యంగా అపాయింట్‌మెంట్లు రద్దయిన వారు, తమ తదుపరి చర్యల కోసం కాన్సులేట్ (US Consulate) నుండి వచ్చే సమాచారం కోసం వేచి ఉండాలని కాన్సులేట్ సూచించింది.







