Satyanadella:టెక్నాలజీలో తమ కంపెనీ కీలక పాత్ర : సత్యనాదెళ్ల

ప్రపంచం కృత్రిమ మేధస్సుకు అనుగుణంగా మారుతున్న నేపథ్యంలో టెక్నాలజీలో తమ కంపెనీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్యనాదెళ్ల (Satyanadella) పేర్కొన్నారు. కంపెనీ ఉద్యోగుల (Employees) కు ఆయన ఓ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ టెక్నాలజీలో దూసుకుపోతుందన్నారు. కొత్త తరం ఆవిష్కరణల్లో తాము ముందుకు సాగుతున్నామని, ఇప్పుడు దీన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమతుల్యతను సాధించడం కష్టతరమైన పని అని, ఏళ్ల పాటుగా కొన్ని కంపెనీలు మాత్రమే దీన్ని చేయగలిగాయన్నారు. విజయం సాధించాలంటే దశాబ్దాల పాటు ఆలోచిస్తూనే ఉండాలన్నారు. భవిష్యత్తుపై దృష్టిసారించాలని, నిరంతరం మనల్ని మనం మెరుగుపరుచుకునేలా ఉత్సుకతను నింపుకోవాలన్నారు. ఈ సందర్భంగా లక్ష్యాలను సాధించే క్రమంలో భద్రత, నాణ్యత, ఏఐ (AI) ఆవిష్కరణ వంటివి తమ ప్రాధాన్యమన్నారు. తమ కంపెనీ సేవలు ప్రపంచానికి కీలకమైనవని వ్యాఖ్యానించారు. ఏఐ మౌలిక సదుపాయాల రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నామన్నారు.